-
చర్లపల్లి బస్టాండ్లో విగ్రహాల తొలగింపుపై తీవ్ర నిరసన
-
వేసి నివాళులు -
విగ్రహాలను పునఃప్రతిష్టించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
చర్లపల్లి, ఏప్రిల్ 20 (ప్రజా సాక్షి): చర్లపల్లి బస్టాండ్లో ఏర్పాటు చేసిన మహనీయులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య సామాజిక వర్గాలను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
ఘటనా స్థలిలో నిరసన
విగ్రహాల తొలగింపు వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ విగ్రహాలు తొలగించిన ప్రదేశంలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల విగ్రహాలను అర్ధరాత్రి పూట దొంగచాటుగా తొలగించడం అత్యంత అన్యాయమని, ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు.
ప్రభుత్వానికి డిమాండ్
తొలగించిన విగ్రహాలను తక్షణమే అదే స్థలంలో పునఃప్రతిష్టించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మరియు పోలీసులను కోరారు. విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేసే వరకు తాము విశ్రమించబోమని, అవసరమైతే ఈ అంశంపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
పాల్గొన్న నాయకులు: ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు డప్పు గిరి బాబు, బొజ్జ నర్సింహ, కడియాల యాదగిరి, దర్శనం లక్ష్మయ్య, బొజ్జ భిక్షపతి, కడియాల అనిల్ కుమార్, డప్పు సతీష్, కడియాల కుమార్, దర్శనం బాలకృష్ణ, జె. ప్రభాకర్ రెడ్డి, కె. నరేష్ గౌడ్, శేఖర్ రెడ్డి, కోటి రెడ్డి, రెడ్డి నాయక్, అంజన్న, సుభాష్, సూర్య మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.




