
కరీ౦నగర్ (నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : కరీంనగర్‌కు చెందిన ఎస్ వి జె సి (SVJC) జూనియర్ కళాశాల విద్యార్థులు నేడు విడుదలైన ఇంటర్మీడియట్-2026 ఫలితాలలో రాష్ట్రస్థాయి మార్కులతో అఖండ విజయం సాధించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ విద్యార్థులను సత్కరిస్తూ, ప్రణాళికాబద్ధమైన కృషి మరియు అంకితభావం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఎస్.కె. తమన్నా, వెన్నెల 992 మార్కులతో మెరవగా, బైపీసీలో పాగా సహస్ర 994 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థిని గుగ్గిళ్ళ గ్రీష్మ 468 మార్కులతో, బైపీసీలో ముల్కల ఉమాదేవి 435 మార్కులతో, సీఈసీలో జవ్వాజి ఈశ్వర వదన్ 490 మార్కులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. అధ్యాపకుల బోధన, పటిష్ట పర్యవేక్షణే ఈ విజయానికి చిహ్నాలని పేర్కొంటూ, విజేతలకు కళాశాల కరెస్పాండంట్ ఉట్కూరి మహేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ వరప్రసాద్, రాంరెడ్డి మరియు డైరెక్టర్లు అభినందనలు తెలియజేశారు.





