
విశాఖపట్టణం (నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నేతలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనెల 14న సాయంత్రం 5 గంటలకు డాబా గార్డెన్స్ ఎల్ఐసీ అంబేద్కర్ విగ్రహం నుండి అంబేద్కర్ భవన్ వరకు భారీ ఊరేగింపు, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్, పోలీస్ కమిషనర్ డా. శంఖ బ్రత బాగ్చి, హెచ్పీసీఎల్ సిజిఎం జి. కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా విద్య, ఉపాధి రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సొసైటీ ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బాబాసాహెబ్ స్ఫూర్తిని చాటిచెప్పేలా జరిగే ఈ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక ఐక్యతను చాటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.





