
కరీ౦నగర్ (నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులతో అఖండ విజయాన్ని నమోదు చేసి జయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కె. పల్లవి, జి. హైంథవి సహా నలుగురు విద్యార్థులు 1000కి 996 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, బైపీసీలో ఆర్. వైష్ణవి బృందం 995 మార్కులతో సత్తా చాటారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో డి. వినిష, జి. అక్షర 469 మార్కులతో, బైపీసీలో ఎస్. జాగృతి బృందం 440కి 439 మార్కులతో రాష్ట్రస్థాయి ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఎంఈసీ, సీఈసీ విభాగాల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ స్కోర్లతో ప్రతిభ కనబరచగా, వందలాది మంది విద్యార్థులు 990కి పైగా మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని చాటారు. పటిష్టమైన విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే నీట్, ఎంసెట్ పరీక్షల్లోనూ ఇదే తరహా విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.




