
మంచిర్యాల (నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పీఎం శ్రీ (PM SHRI) తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభతో మెరిశారు. ద్వితీయ సంవత్సరంలో 92 శాతం, ప్రథమ సంవత్సరంలో 81 శాతం ఉత్తీర్ణతతో పాఠశాల సత్తా చాటినట్లు ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ వెల్లడించారు. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఎం. వైష్ణవి 983 మార్కులతో, బీపీసీలో టి. హర్షిణి 960 మార్కులతో, సీఈసీలో టి. సాయి నేహా 949 మార్కులతో టాపర్లుగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థి 467 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించగా, సీఈసీలో కె. అభిరామ్ 463 మార్కులతో విశేష ప్రతిభ కనబరిచారు. ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో పాఠశాల పేరు నిలబెట్టిన విద్యార్థులను ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.




