
నిర్మల్ ( నేషనలిస్ట్ వాయిస్) ఏప్రిల్ 12 : నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కొనియాడారు. ప్రథమ సంవత్సరంలో 73.43 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 13వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 62.93 శాతంతో 12వ స్థానం సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూనే, ఫలితాల్లో వెనుకబడిన వారు నిరుత్సాహపడకుండా పట్టుదలతో కృషి చేయాలని కలెక్టర్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. విద్యార్థుల ఉన్నతికి తోడ్పడిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందిస్తూ, రానున్న రోజుల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. ఈ మేరకు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తులో రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.




