విశాఖ, మే 14: నగరంలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు వైజాగ్ సిటీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్, పోలీస్ కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలోని కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టే
షన్, కోరియర్ కార్యాలయాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, లగేజ్ బ్యాగులు, పార్సిళ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గంజాయి సహా మత్తుపదార్థాల అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు సాగుతున్నామని, ప్రజల భద్రతతో పాటు యువత భవిష్యత్తును రక్షించడమే ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు. నగరంలో నిరంతర నిఘా కొనసాగిస్తూ, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వైజాగ్ సిటీ పోలీసులు పేర్కొన్నారు.
this thing helping us a lot by giving us the information