- బెల్లంకొండ గణేష్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో కొత్త సినిమా
- ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్న ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ
- సంగీతం సమకూరుస్తున్న చార్ట్‌బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో
- ఘనంగా జరిగిన పూజా కార్యక్రమం.. ప్రారంభించిన వీవీ వినాయక్
- గోల్డెన్ టర్టిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మౌనిక రెడ్డి నిర్మాణం
ఈ సినిమాకు ముగ్గురు ప్రముఖ టెక్నీషియన్లు కలిసి పనిచేస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కరుణాకరన్ తన మార్క్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తుండగా, ‘జాతిరత్నాలు’ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు అనుదీప్ కేవీ ఈ సినిమాకు సంభాషణలు అందిస్తున్నారు. ఆయన రాసే వినూత్నమైన హాస్యం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. వీరికి తోడుగా, చార్ట్‌బస్టర్ పాటలతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ ముగ్గురి కలయిక సినిమాపై అంచనాలను పెంచుతోంది.
హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై మొదటి క్లాప్ కొట్టారు. అనుదీప్ కేవీ కెమెరా స్విచాన్ చేయగా, చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.




