-
ముత్తంగి మంజీరా హైస్కూల్ ఆవరణలో ఘనంగా వేడుకలు
-
పీపీ2 పూర్తి చేసుకున్న చిన్నారులకు పట్టాల ప్రదానం
-
అతిథులను అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
ముత్తంగి, ఏప్రిల్ 21
: స్థానిక మంజీరా హైస్కూల్ (CBSE) ఆవరణలో మంజీరా పిరమిడ్ స్కూల్ మరియు మంజీరా లిటిల్ బుద్ధ స్కూల్ విద్యార్థులకు ‘గ్రాడ్యుయేషన్ డే’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఫ్రీ-స్కూల్ విద్యను పూర్తి చేసుకుని ఒకటవ తరగతిలోకి ప్రవేశిస్తున్న పీపీ2 విద్యార్థులకు పట్టాల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంజీరా విద్యాసంస్థల చైర్మన్ డి. జగన్ మోహన్, ప్రిన్సిపల్ డి. రేవతి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
చిన్నారుల పట్టా ప్రదానం
ప్రీ-స్కూల్ విద్యను విజయవంతంగా పూర్తి చేసిన చిన్నారులకు అతిథులు మెడల్స్ మరియు సర్టిఫికేట్లను అందజేసి వారిని అభినందించారు. గ్రాడ్యుయేషన్ దుస్తుల్లో చిన్నారులు చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి.
గుర్తింపు పొందిన విద్యాసంస్థలనే ఎంచుకోవాలి: చైర్మన్
ఈ సందర్భంగా చైర్మన్ డి. జగన్ మోహన్ మాట్లాడుతూ.. పిల్లలే రేపటి జాతి సంపద అని, వారి సమగ్ర వికాసం కోసమే మంజీరా విద్యాసంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఇదే క్రమంలో తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తూ, ప్రస్తుతం మార్కెట్లో చాలా పాఠశాలలు సీబీఎస్ఈ గుర్తింపు లేకపోయినప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తంగి, ఇస్నాపూర్ సర్కిల్లో కేవలం మంజీరా హైస్కూల్ మాత్రమే సీబీఎస్ఈ గుర్తింపు నంబర్ కలిగి ఉందని ఆయన స్పష్టం చేశారు.
పునాది బలంగా ఉండాలి: ప్రిన్సిపల్
ప్రిన్సిపల్ డి. రేవతి మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్యే పునాది అని, అది బలంగా ఉంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పేర్కొన్నారు. తమ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విలువలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. తమ పిల్లల ప్రగతిని చూసి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.




