-
సి.సి. రోడ్లు, ప్లే గ్రౌండ్ అభివృద్ధిపై వినతిపత్రం అందజేత
-
రూ. 5 నుండి 10 కోట్లతో ప్లే గ్రౌండ్ అభివృద్ధికి కృషి: సుధీర్ రెడ్డి
హయత్నగర్, ఏప్రిల్ 18 (ప్రజా సాక్షి): ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్నగర్ డివిజన్ పరిధిలోని మిధాని కాలనీ నివాసుల సంక్షేమ సంఘం ప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే
ని మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
వర్షం వస్తే రోడ్లు గల్లంతు
ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. మిధాని కాలనీ రోడ్ నెం. 2/H లో ప్రతిసారి వర్షం పడినప్పుడు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోతోందని, దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర ప్రాతిపదికన అక్కడ సి.సి. రోడ్డు వేయాలని, అలాగే కాలనీలో మిగిలిపోయిన ఇతర రోడ్లను కూడా పూర్తి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
రూ. 10 కోట్లతో ప్లే గ్రౌండ్ అభివృద్ధి
రోడ్ నెం. 3 లో ఉన్న ప్లే గ్రౌండ్ అభివృద్ధి అంశంపై కూడా ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పందిస్తూ.. ఈ గ్రౌండ్ అభివృద్ధికి సుమారు రూ. 5 నుండి 10 కోట్ల భారీ బడ్జెట్ అవసరమవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిధులు మంజూరయ్యేలా చూస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. నూతన రోడ్ల నిర్మాణానికి సంబంధించి వెంటనే ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిస్తానని తెలిపారు.
పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో హయత్నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెన్నగోని శ్రీధర్ గౌడ్, సంక్షేమ సంఘం అధ్యక్షులు యాదిరెడ్డి, ముస్తఫా హుస్సేన్, రమేష్ రెడ్డి, రాంరెడ్డి, వినోద్ రెడ్డి మరియు పార్టీ నాయకులు గుత్తా లక్ష్మణ్ రెడ్డి, మధు, సందీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




