
మేడ్చల్ (నేషనలిస్ట్ వాయిస్ ప్రతినిధి) ఏప్రిల్ 20 : నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన పనస మధు అనే వ్యక్తి, ఎఫ్.సి.ఐ (FCI) గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా నకిలీ గుర్తింపు కార్డులతో మోసానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. నిరుద్యోగి అయిన ఇతడు చెర్లపల్లి ఎఫ్.సి.ఐలో ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి, ఓ యువతితో రూ. 1.5 కోట్ల వరకట్నం కుదుర్చుకుని నిశ్చితార్థం చేసుకున్నాడు. బాధితురాలు తనపై నిందలు వేస్తూ వేధిస్తున్న మధు ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారించగా, అతని మోసం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి రెండు నకిలీ ఐడీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్ మరియు ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అని రాసి ఉన్న కారును స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి సంబంధాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.


