
సంగారెడ్డి ( నేషనలిస్ట్ వాయిస్ ప్రతినిధి) ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఆదివారం నూతన మార్కెట్ కమిటీ కొలువుదీరిన సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి నూతన కార్యవర్గానికి రైతులు మరియు వ్యాపారుల సంక్షేమమే పరమావధిగా నూతన కమిటీ అంకితభావంతో పనిచేయాలని కీలక పిలుపునిచ్చారు. చైర్మన్గా యేపూరి శివానందం, వైస్ చైర్మన్గా రాజశేఖర్ మరియు పాలక మండలి సభ్యులు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆదిత్యరెడ్డి మాట్లాడుతూ, రైతులు మరియు వ్యాపారుల సంక్షేమమే పరమావధిగా నూతన కమిటీ అంకితభావంతో పనిచేయాలని కోరారు. పటాన్చెరు మార్కెట్ యార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి, రైతులకు అండగా నిలవాలని ఆయన సభ్యులకు సూచించారు. ఈ వేడుకలో టీజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి నూతన కమిటీకి తమ మద్దతును ప్రకటించారు.


