-
మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన యువనేత ముద్దగౌని మనీష్ గౌడ్
ఎల్బీనగర్, మే 20 :
పీసీసీ మాజీ కార్యదర్శి, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను బుధవారం నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుగాంచిన రామ్మోహన్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్బీనగర్ యువనాయకులు ముద్దగౌని మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో సాహెబ్‌నగర్ డివిజన్ గౌతమినగర్ కాలనీలోని ‘శాంతినికేతన్ మానసిక వికలాంగుల ఆశ్రమం’ నందు ఆశ్రమ పిల్లలకు, దివ్యాంగులకు ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యువనేత ముద్దగౌని మనీష్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన, నిరుపేద వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ, ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న రామ్మోహన్ గౌడ్ జన్మదిన వేడుకలను ఇలాంటి సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లి, భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు స్వహస్తాలతో భోజనాలు వడ్డించారు. తమ పుట్టినరోజున ఇలాంటి ఆదరణ అందించినందుకు ఆశ్రమ నిర్వాహకులు ముద్దగౌని కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సేవా కార్యక్రమంలో శాంతినికేతన్ ఫౌండేషన్ నిర్వాహకులు బాలేశ్వర్, ముఖ్య నాయకులు శాండీ, సోను యాదవ్, ఆశీష్ చౌదరి, సన్నీ, అంజి, వంశీ, గౌతమ్, సాయి మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువజన విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

