-
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మానవతా దృక్పథం
-
ఆపిల్ పుట్టినరోజు పురస్కరించుకుని నిరుపేద కుటుంబానికి అండ
మందమర్రి, మే 19 :
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఓర్రగడ్డలో నివసిస్తున్న నిరుపేద వృద్ధ దంపతులు శోభా దేవి కుటుంబానికి ‘ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ’ ఆధ్వర్యంలో మంగళవారం నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. సొసైటీ సభ్యుడు రామటేంకి ఆపిల్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాధిత కుటుంబానికి నిరంతరం అండగా ఉంటాం
ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్, ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్ మాట్లాడుతూ.. శోభా దేవి దంపతులు
వృద్ధాప్య భారంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీరి దీనస్థితిని గమనించిన స్థానికులు తమ సొసైటీని సంప్రదించగా, వెంటనే స్పందించి నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను సమకూర్చినట్లు వివరించారు. గతంలో కూడా ఈ కుటుంబానికి సొసైటీ తరఫున సాయం అందించామని, భవిష్యత్తులోనూ వీరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన ‘ఝాన్సీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్’ నిర్వాహకులకు, వారి కుటుంబ సభ్యులకు సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ మానవతా కార్యక్రమంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నాదిపాట రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, ఎండి. జావిద్ పాషా, శ్రీనివాస్, కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

