-
ముఖ్య అతిథులుగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శశిధర్ రెడ్డి
-
రిబ్బన్ కట్ చేసిన డాన్స్ మాస్టర్ చెర్రీ.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
ఎల్బీనగర్, మే 16
: చైతన్యపురి డివిజన్ పరిధిలోని ద్వారకాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మహిరామ్” డాన్స్ స్టూడియో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నిర్వాహకులు మహి, రామ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజకీయ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చైతన్యపురి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శశిధర్ రెడ్డి మరియు ప్రముఖ డాన్స్ మాస్టర్ చెర్రీలు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ సరికొత్త డాన్స్ స్టూడియోను అధికారికంగా ప్రారంభించారు.
యువత ప్రతిభకు మంచి వేదిక
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. నేటి తరం యువతలో మరియు చిన్న పిల్లల్లో దాగి ఉన్న నృత్య నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి ఆధునిక డాన్స్ స్టూడియోలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ద్వారకాపురం పరిసర ప్రాంతాల వారికి అందుబాటులో ఈ స్టూడియోను తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. మహి, రామ్ ల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ స్టూడియో భవిష్యత్తులో మరెంతో మంది ఉత్తమ నృత్యకారులను సినీ, టెలివిజన్ రంగానికి అందించాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఉత్సాహభరిత ప్రారంభోత్సవ వేడుకలో స్థానిక ప్రముఖ నాయకులు రామకృష్ణ, సాయి ప్రశాంత్, చింటు, జలంధర్, పులి కిరణ్, శ్రీధర్, సాయి, నాగరాజులతో పాటు పలువురు కాలనీ వాసులు, కళాకారులు మరియు నిర్వాహక బృందం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.

