-
సందేహాల నివృత్తికి 08736-250501 నంబర్లో సంప్రదించవచ్చు
-
అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మే 16 :
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు, ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో (కలెక్టరేట్) ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.
సవరణ కార్యక్రమ పూర్తి షెడ్యూల్ ఇదే:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
| క్రమ సంఖ్య | కార్యక్రమం / ప్రక్రియ | నిర్వహించు తేదీలు |
| 1 | సన్నాహక, శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు | జూన్ 15 నుండి జూన్ 24 వరకు |
| 2 | బూత్ స్థాయి అధికారుల (BLO) ఇంటింటి సందర్శన | జూన్ 25 నుండి జూలై 24 వరకు |
| 3 | పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ (Rationlization) | జూలై 24వ తేదీన |
| 4 | ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ | జూలై 31వ తేదీన |
| 5 | దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ | జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు |
| 6 | ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ | సెప్టెంబర్ 28వ తేదీ వరకు |
| 7 | తుది ఓటరు జాబితా ఉమ్మడి ప్రచురణ | అక్టోబర్ 1వ తేదీన |
పనిదినాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు..
ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు మరియు తొలగింపులపై ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా, సమాచారం కావాలన్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08736-250501 లో సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ అన్ని ప్రభుత్వ పనిదినాలలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, జిల్లాలోని ఓటర్లు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

