-
చల్గల్లో మే డే వేడుకలు
-
కార్మికులకు అండగా ఉంటామన్న జీవన్ రెడ్డి, దావ వసంత
జగిత్యాల రూరల్, మే 02: ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. మాజీ మంత్రి, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మరియు జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్మికుల సేవలు వెలకట్టలేనివి
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, సమాజం కోసం వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఎండనక, వాననక కష్టపడే కార్మిక వర్గానికి ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలని కోరారు. దావ వసంత సురేష్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కార్మికులను శాలువాలతో సత్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు.
పాల్గొన్న ప్రముఖులు: ఈ కార్యక్రమంలో చల్గల్ సర్పంచ్ జున్ను రాజేందర్, సర్పంచులు సురేందర్, మల్లారెడ్డి, కవిత స్వామి రెడ్డి, చెవుల గంగన్న, బాలే రవి పాల్గొన్నారు. అలాగే జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, మాజీ సర్పంచులు ఎల్లా గంగానర్షు, రాజన్న, పొచమల్ల్య, నాయకులు సత్తన్న, ముత్యం, చందు, సోహెల్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.




