పాల్గొన్న ఎంపీఓ మరియు గ్రామ పాలకవర్గం
ధర్పల్లి, ఏప్రిల్ 25: ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామపంచాయతీ పరిధిలో గల వారసంత వేలం పాట శనివారం ఉదయం పారదర్శకంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ వేలంలో పలువురు బిడ్డర్లు పాల్గొన్నారు.
సొంతం చేసుకున్న గంగాధర్
గ్రామపంచాయతీ ముందుగా నిర్ణయించిన డిపాజిట్ మొత్తాన్ని చెల్లించి వేలం పాటలో పాల్గొన్న అభ్యర్థులలో, అంకం నడిపి గంగాధర్ అత్యధికంగా 48 వేల రూపాయలకు కోట్ చేసి, ఈ ఏడాది వారసంత నిర్వహణ హక్కులను సొంతం చేసుకున్నారు.
అధికారుల సమక్షంలో ప్రక్రియ
ఈ వేలం పాటను మండల పరిషత్ అధికారి (ఎంపీఓ) రాజేష్, గ్రామ కార్యదర్శి సాయికుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజినీ దేవి, ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి పాల్గొని వేలం ప్రక్రియను పూర్తి చేశారు. పంచాయతీ ఆదాయాన్ని పెంచే దిశగా నిబంధనల ప్రకారం ఈ వేలం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




