మందమర్రిలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
మందమర్రి, ఏప్రిల్ 25: ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం మందమర్రి మండలంలోని ఊరు మందమర్రిలో నిర్వహించిన ’99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అధికారులపై గ్రామస్థుల ఫిర్యాదు
ఈ సందర్భంగా గ్రామస్థులు మున్సిపల్ అధికారుల తీరుపై కలెక్టర్ దృష్టికి పలు ఫిర్యాదులు తీసుకువచ్చారు. గ్రామంలో శానిటేషన్ (పారిశుధ్యం) నిర్వహణ అధ్వానంగా ఉందని, అధికారులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, పారిశుధ్య పనుల్లో అలసత్వం వహిస్తే ఊపేక్షించేది లేదని సంబంధిత అధికారులను హెచ్చరించారు.
వ్యాధులపై అవగాహన.. పరిసరాల పరిశుభ్రత
అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించిన కలెక్టర్, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
-
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
-
నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చు.
-
పరిశుభ్రత పాటించడం ద్వారానే సీజనల్ వ్యాధుల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.




