ధర్పల్లి, ఏప్రిల్ 24
: మండలంలోని దుబ్బాక గ్రామంలో రేపు (శనివారం) వారసంత బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు గ్రామ కార్యదర్శి సాయికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామంలోని గాంధీ చౌక్ ఆవరణలో ఉదయం 10:30 గంటలకు గ్రామ సర్పంచ్ సరోజినీ దేవి, ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి సమక్షంలో ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తి గల వారు గ్రామపంచాయతీ నిబంధనల మేరకు నిర్ణయించిన డిపాజిట్ మొత్తాన్ని ముందుగా చెల్లించి, వేలంలో పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.




