వేల్పూర్, ఏప్రిల్ 23
: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గురువారం నిర్వహించిన రేఖ విజయలక్ష్మి-భూమేష్ దంపతుల నూతన గృహప్రవేశ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నాడు ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇంటి పథకం కింద నిర్మించుకున్న తమ నూతన గృహప్రవేశానికి రాష్ట్ర స్థాయి నేత మానాల మోహన్ రెడ్డి విచ్చేయడం పట్ల రేఖ భూమేష్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఘన స్వాగతం పలికి, ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం మోహన్ రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి, రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉట్నూర్ సుభాష్, లక్కోర గ్రామ సర్పంచ్ అపర్ణ, ఉప సర్పంచ్ ఆడవాల ఆత్మరాం పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాల సర్పంచులు రాజు, లతీషా భూమారెడ్డి, పంచాయతీ సెక్రెటరీ విజయ్ మరియు మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన గృహప్రవేశం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.




