- శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం
- పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో నాని
- తొలి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాని
- ఈ సినిమా కోసం నా సర్వస్వం ఇస్తానన్న విజయ్ దేవరకొండ
- వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం
ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్, నాని కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు ప్రముఖ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘హాయ్ నాన్న’కు అద్భుతమైన సంగీతం అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్, ఈ చిత్రానికి కూడా స్వరాలు సమకూర్చనున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ తన ప్రస్తుత కమిట్మెంట్లు పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
ఇంతకుముందే, దీనిపై విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. “ఈ భయపెట్టే సినిమాను రూపొందించేందుకు ఒక అద్భుతమైన గ్లోబల్ టీమ్‌ను పరిచయం చేస్తున్నా. శౌర్యువ్ అద్భుతమైన ఆలోచనలకు, ఆయనలోని తీవ్రతకు వీరు తోడవుతున్నారు. ఈ సినిమా కోసం నా సర్వస్వం ఇస్తాను” అని పేర్కొన్నారు




