-
క్రీడలతోనే మానసిక ఉల్లాసం: అంజనీపుత్ర ఎస్టేట్స్ డైరెక్టర్లు
-
టోర్నమెంట్ ప్రారంభించిన ఉప్పరి లక్ష్మణ్, మండే శ్రీధర్
మందమర్రి, ఏప్రిల్ 17 (ప్రజా సాక్షి): మందమర్రి మండలం ఊరు రామకృష్ణాపూర్ గ్రామంలో అంజనీపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారుల కేరింతల మధ్య ఉత్సాహంగా ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన ఈ వేడుకకు అంజనీపుత్ర ఎస్టేట్స్ డైరెక్టర్లు ఉప్పరి లక్ష్మణ్, మండే శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
క్రీడలపై ప్రత్యేక మక్కువ:
ఈ సందర్భంగా డైరెక్టర్లు క్రీడాకారులను పరిచయం చేసుకుని, టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం మండే శ్రీధర్ మాట్లాడుతూ.. భారతదేశంలో క్రికెట్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరియు ఆదరణ ఉందన్నారు. క్రీడాకారులు మైదానంలో ఎంతో బావోద్వేగంతో లీనమై ఆడతారని, గెలుపోటముల కంటే క్రీడా స్ఫూర్తి ముఖ్యమని ఆయన ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల యువతలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.
నిర్వాహకులకు కృతజ్ఞతలు:
స్థానిక క్రీడాకారులు మాట్లాడుతూ.. గ్రామంలో క్రీడలను ప్రోత్సహిస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన అంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, డైరెక్టర్లు ఉప్పరి లక్ష్మణ్, మండే శ్రీధర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.




