
సంగారెడ్డి ( నేషనలిస్ట్ వాయిస్ ప్రతినిధి) ఏప్రిల్ 20 : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాలకంటి యాదగిరి యాదవ్ పితృవియోగం పట్ల పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాదగిరి యాదవ్ తండ్రి మల్లయ్య మరణవార్త తెలిసిన వెంటనే బండ్లగూడలోని వారి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే, మల్లయ్య పార్థీవ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు దైవం మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ యాదగిరి యాదవ్‌ను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో చురుగ్గా పాల్గొనే యాదగిరి యాదవ్ కుటుంబానికి ఎమ్మెల్యే అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మల్లయ్య మరణం పట్ల స్థానిక రాజకీయ నాయకులు సైతం సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు మల్లయ్యకు తుది నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.





