
సంగారెడ్డి ( నేషనలిస్ట్ వాయిస్ ప్రతినిధి) ఏప్రిల్ 20 : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మార్కెట్ ప్రాంగణంలో ఘనంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కమిటీకి చైర్మన్గా శివానందం, వైస్ చైర్మన్గా రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించగా, మొత్తం 14 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎస్.సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, నీలం మధు ముదిరాజ్ మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా నూతన కమిటీ పని చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.





