-
నియమించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్
-
యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని సజన్ వెల్లడి
మందమర్రి, మే 14
: మంచిర్యాల జిల్లా సింగరేణి మైనర్స్ & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (HMS) మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడిగా సిద్దంశెట్టి సజన్ నియమితులయ్యారు. హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
కృతజ్ఞతలు తెలిపిన సజన్
ఈ సందర్భంగా సిద్దంశెట్టి సజన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఏరియా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన గౌరవ అధ్యక్షురాలు కవితకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి, యూనియన్ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని ఆయన పేర్కొన్నారు. ఏరియాలోని కార్మికులకు అందుబాటులో ఉంటూ, వారి హక్కుల కోసం హెచ్ఎంఎస్ పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. సజన్ నియామకం పట్ల మందమర్రి ఏరియా కార్మికులు, యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

