ఖమ్మానికి చెందిన నిరుపేద సెలూన్ హెయిర్ కటింగ్ వర్కర్ దాసు రామకృష్ణ తీవ్ర గుండె సంబంధిత అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. రామకృష్ణకు గుండె మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుండె మార్పిడి కోసం ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో, రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న రామకృష్ణ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. చిన్న వయసులోనే గుండె మార్పిడి అవసరం రావడంతో భార్య, ఇద్దరు చిన్న పిల్లలు తీవ్ర ఆందోళనలో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ, ఆపరేషన్‌కు అవసరమైన డబ్బులు సిద్ధం చేసుకోవాలని వైద్యులు సూచించడంతో దాతలు ముందుకు వచ్చి తన ప్రాణాలు కాపాడాలని కన్నీటి విజ్ఞప్తి చేస్తున్నాడు. సాయం చేయదలచిన దాతలు ఫోన్‌పే నంబర్ 8096638315 ద్వారా సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

