-
ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ మర్యాదపూర్వక భేటీ
-
అభినందనలు తెలిపి, శుభాకాంక్షలు అందజేసిన ఎస్పీ
, మే 02: జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో డీసీఆర్బీ (DCRB) ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
బాధ్యత మరింత పెరిగింది: ఎస్పీ
పదోన్నతి పొందిన శ్రీనివాస్‌ను ఎస్పీ అశోక్ కుమార్ శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలంగా ప్రజా సంరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వారికి లభించే గొప్ప గుర్తింపు ఈ పదోన్నతి అని కొనియాడారు. “ఉద్యోగ జీవితంలో పదోన్నతి అనేది ఒక ముఖ్యమైన మైలురాయి. ఉన్నత హోదా పొందినప్పుడు బాధ్యత కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. పోలీస్ శాఖలో మరింత అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు సేవ చేయాలి” అని ఆయన ఆకాంక్షించారు.
ఈ పదోన్నతి పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది. తన పదోన్నతికి సహకరించిన పై అధికారులకు మరియు తోటి సిబ్బందికి శ్రీనివాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.




