హైదరాబాద్, మే 02: రాజ్యసభ సభ్యులు మరియు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని శనివారం ఉదయం పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లిన నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
నరేందర్ రెడ్డిని కలిసిన వారిలో పీసీసీ మాజీ కార్యదర్శి, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జడల రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం మరియు ప్రస్తుత రాజకీయ అంశాలపై క్లుప్తంగా చర్చించినట్లు సమాచారం.




