-
కేసీఆర్ దూరదృష్టితోనే తెలంగాణ సాధ్యం: ఎమ్మెల్యే
-
లింగోజిగూడ లిబర్టీ చౌరస్తాలో గులాబీ పండుగ
ఎల్బీనగర్, ఏప్రిల్ 27
: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎల్బీనగర్ నియోజకవర్గంలో మిన్నంటాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని లింగోజిగూడ డివిజన్ పరిధిలోని లిబర్టీ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
దేశానికి ఆదర్శంగా నిలిచిన పథకాలు
జెండా ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన పోరాటం మరియు ఆయన దూరదృష్టి వల్లే నేడు ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని కొనియాడారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల పక్షాన ఉండి వారి నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
తరలివచ్చిన శ్రేణులు
ఈ సందర్భంగా గులాబీ శ్రేణులు బాణసంచా కాల్చి, నినాదాలతో హోరెత్తించాయి. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ నాయకులు తిలక్ రావు, రాజశేఖరరెడ్డి, ఆడాల రమేష్, దయానంద్, రాకేష్ ఠాగూర్, జగన్నాద్ రెడ్డి, నర్సింహా గుప్తా, భాస్కర్ గంగపుత్ర, ఇంద్రాజీ, ఆశిష్, నాగేశ్వర్రావు, శ్రీధర్, ప్రకాష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
అలాగే చిత్రం సాయి, షఫీ, వెంకట్ రెడ్డి, రాజేందర్, ప్రసాద్, యశ్వంత్, రుద్ర శ్రీను, అనిల్, వెంకటేష్ గౌడ్, దిలీప్, అనూష, విజయ్ గౌడ్, దేవి, లక్ష్మి మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




