-
మెట్పల్లిలో 3వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె
-
డిపో గేటు ముందు కొవ్వొత్తులతో ప్రదర్శన
మెట్పల్లి, ఏప్రిల్ 24: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై టీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మెట్పల్లి డిపో కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మెలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన కార్మిక నాయకుడు శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మెట్పల్లి డిపో గేటు ముందు కార్మికులు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు.
కార్మిక ఐక్యత వర్ధిల్లాలి
మెట్పల్లి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శంకర్ గౌడ్ త్యాగం వృధా పోనివ్వమని, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు ప్రతినబూనారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: ఏఐటీయూసీ (AITUC) పట్టణ కార్యదర్శి ఉస్మాన్ తరపున జేఏసీ చైర్మన్ వి. మురళీధర్, కన్వీనర్ జె. రాములు, సెక్రటరీ బి. నగేష్, అసిస్టెంట్ సెక్రటరీ రాఘవ, క్యాషియర్ సిహెచ్. బలరాం, వేణుగోపాల్, ఎం.ఆర్. గౌడ్, ప్రసాద్, శేఖర్, సురేందర్, రమేష్ మరియు మహిళా కార్మికులు రజిత, శోభ, విజయ, మంజుల తదితరులు పాల్గొన్నారు.




