- ఆ దర్శకుడితో మళ్ళీ పనిచేయకూడదని నిర్ణయించుకున్నానన్న ప్రగతి
- తనకు డబ్బు కంటే మంచి పాత్రలే ముఖ్యమని వెల్లడి
- ఫిట్నెస్ అనేది తన జీవితంలో ఒక భాగమని వ్యాఖ్య
తెలుగు సినీ పరిశ్రమలో నటి ప్రగతిది ఒక ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవచ్చు. ఎన్నో సినిమాల్లో సహాయ నటిగా నటించిన ప్రగతి… మంచి నటిగా గుర్తింపు పొందారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఆమె మాట్లాడుతూ… వృత్తిపరంగా తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
గతంలో ఒక దర్శకుడితో పనిచేసిన సమయంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని, ఆ అనుభవం తనకు ‘నరకం’లా అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చేదు జ్ఞాపకం వల్ల భవిష్యత్తులో ఆ దర్శకుడితో మళ్ళీ పనిచేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనకు డబ్బు కంటే మంచి పాత్రలే ముఖ్యమని, కథ లేదా తన పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద అవకాశం వచ్చినా వదులుకోవడానికి వెనకాడనని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ప్రగతి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ అనే విషయం అందరికీ తెలిసిందే. 50 ఏళ్ల వయసులోనూ జిమ్లో కఠినమైన వర్కవుట్లు చేస్తూ, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మెడల్స్ సాధిస్తున్నారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ… ఫిట్నెస్ అనేది తన జీవితంలో ఒక భాగమని పేర్కొన్నారు.




