-
మోబిన్ షాప్ తండాలో నర్సరీల పరిశీలన
-
వేసవి దృష్ట్యా మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలి
ధర్పల్లి, ఏప్రిల్ 21 (ప్రజా సాక్షి): ధర్పల్లి మండల పరిధిలోని మోబిన్ షాప్ తండాలో ఉన్న నర్సరీలను ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ మలావత్ బాలు నాయక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నర్సరీల్లో పెరుగుతున్న మొక్కల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఎండల తీవ్రతపై అప్రమత్తత
ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. ప్రస్తుతం వేసవి ఎండలు క్రమంగా పెరుగుతున్నాయని, ఈ సమయంలో నర్సరీల్లోని మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కలను కాపాడుకోవడానికి నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో క్రమం తప్పకుండా నీరు అందించాలని ఆదేశించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మొక్కల పెంపకంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని వారు స్పష్టం చేశారు. హరితహారం లక్ష్యం నెరవేరాలంటే నర్సరీల నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




