ఖానాపూర్ పట్టణంలోని కొమురం భీం చౌరస్తా వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ CPI(ML) న్యూడెమోక్రసీ అనుబంధ సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ర్యాలీగా వెళ్లిన పేదలు, సంఘాల నాయకులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
అనర్హులను ఇళ్ల నుంచి తొలగించి, సమగ్ర విచారణ అనంతరం అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి పట్టాలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. గతంలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన వారికి ఇళ్లు కేటాయించకుండా ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే పెద్దఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

