
పటాన్చెరు సింఫోనీ పార్క్ హోమ్స్లో 22ఏ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన కాలనీని నిషేధిత జాబితాలో చేర్చడంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం, సామాన్యులకు వేర్వేరు న్యాయాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు.
కాలనీకి గతంలో రెవిన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు మంజూరయ్యాయని పేర్కొన్న రఘునందన్ రావు, ప్రస్తుతం 22ఏ పరిధిలోకి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, అవసరమైతే ప్రజల తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

