
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కుంకుమ పూజ నిర్వహించారు. ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కొలకాని నర్సయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందని నర్సయ్య ముదిరాజ్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మీ మొండయ్య గౌడ్, 41వ డివిజన్ కార్పొరేటర్ నాంపల్లి రేణుక శ్రీనివాస్, కొలకాని నర్సయ్య ముదిరాజ్ పాల్గొన్నారు. ఇతర సంఘం నాయకులు, కుల పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

