
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. తెలంగాణ చౌక్‌లో జనసేన సీనియర్ నాయకులు కందుల రాజిరెడ్డి, కాస రాజు పటేల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 45వ డివిజన్లో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయుష్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగిస్తామని కందుల రాజిరెడ్డి, కాస రాజు పటేల్ తెలిపారు. కార్యక్రమంలో ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

