మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె తన అనుచరులతో సమావేశమై కీలక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో కొనసాగాలా? లేక రాజీనామా చేయాలా? అనే అంశంపై అనుచరుల అభిప్రాయాలను ఆమె తీసుకుంటున్నట్లు సమాచారం.
అధిష్టానం నుంచి నిర్ణయం వెలువడకముందే తానే రాజీనామా ప్రకటించే ఆలోచనలో కొండా సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అనుచరులతో చర్చల అనంతరం కొండా సురేఖ, కొండా దంపతులు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా తమ తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

