-
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పటాన్చెరు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభ కృష్ణారెడ్డి
హైదరాబాద్/పటాన్చెరు, మే 21
:
తెలంగాణ రాష్ట్ర నూతన మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా మరియు సభ్యులుగా నియమితులైన పలువురు మహిళా మూర్తులకు బుధవారం హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ భవనంలో ఘనంగా సత్కారం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శోభ కృష్ణారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ మహిళా ప్రతినిధి బృందం నూతన కమిషన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుంది.
ఈ సందర్భంగా నూతన మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మికి శోభ కృష్ణారెడ్డి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషన్ సభ్యులు శశికళ యాదవ రెడ్డి, కాసోజీ శంకరమ్మ, చిట్యాల శ్వేత, ఉస్మా ఆశాయి షకీరా, సదాలక్ష్మి, ఎన్. రాధాభాయ్లను కూడా ఆమె ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు.
మహిళల రక్షణలో కమిషన్ పాత్ర కీలకం..
అనంతరం శోభ కృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల హక్కుల పరిరక్షణకు, వారి భద్రతకు నూతన కమిషన్ అంకితభావంతో పనిచేస్తుందనే నమ్మకం ఉందన్నారు. మహిళా సాధికారత సాధనలోనూ, బాధితులకు తక్షణ న్యాయం అందించడంలోనూ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి నేతృత్వంలోని కమిటీ వినూత్నంగా ముందడుగు వేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పలువురు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

