-
ముఖ్య అతిథిగా హాజరైన యువ నాయకులు జక్కిడి సత్యతేజ రెడ్డి
-
నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు
ఎల్బీనగర్, మే 14 
: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘స్పైసీ రాజా ఫుడ్ విల్లా’ రెస్టారెంట్‌ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జక్కిడి సత్యతేజ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రెస్టారెంట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మన్సూరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఆహార ప్రియుల కోసం అత్యాధునిక వసతులతో రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. నాణ్యమైన రుచులతో వినియోగదారుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు కాసాని అశోక్ యాదవ్ కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రఘు యాదవ్, వినోద్ యాదవ్, జిట్ట అశోక్ యాదవ్, మధు, పృథ్వీరాజ్, విఠల్ రెడ్డి, మున్నా జానీ, వెంకట్ సాయి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన రెస్టారెంట్ ఏర్పాటు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

