-
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
-
అభివృద్ధికి ఆకర్షితులయ్యే చేరికలని వెల్లడి
ఖానాపూర్, ఏప్రిల్ 29
: నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలు కొనసాగుతున్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో పాత తర్లపాడ్ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.
ప్రజా ప్రభుత్వమే మా మార్గం
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకత్వానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
విమర్శలను తిప్పికొట్టాలి: ఎమ్మెల్యే
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. “ప్రజా ప్రభుత్వంపై కావాలని బురద చల్లుతున్న వారి విమర్శలను పనితీరుతోనే తిప్పికొట్టాలి. గ్రామాల్లో ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ ఫలాలను వివరించి పార్టీకి అండగా నిలవాలి” అని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నిమ్మల్ రమేష్, కాంగ్రెస్ నాయకులు శంకర్ మరియు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




