-
జాగృతి వారపత్రిక పంపిణీలో విశేష సేవలకు గుర్తింపు
-
వారపత్రిక యజమాన్యం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం
ఆర్మూర్, ఏప్రిల్ 21
దేశభక్తి మరియు జాతీయ అంశాలతో కూడిన సమాచారాన్ని పాఠకులకు చేరవేయడంలో వారధిగా నిలుస్తున్న పోస్ట్మ్యాన్ల సేవలను గుర్తించి, వారిని గౌరవించుకోవడం అభినందనీయమని ఆర్మూర్ నగర సంఘచాలక్ పోల్కం నారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఆర్మూర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో ‘జాగృతి’ వారపత్రిక తరఫున ఏడుగురు పోస్ట్మ్యాన్లను ఘనంగా సన్మానించారు.
సమయపాలనతో పాఠకుల అభిమానం
జాగృతి వారపత్రికను ప్రతి వారం పాఠకులకు సరైన సమయంలో అందిస్తూ, పత్రిక సర్క్యులేషన్ పెరగడంలో కీలక పాత్ర పోషిస్తున్నందుకు గాను ఏడుగురు పోస్ట్మ్యాన్లను ఎంపిక చేసి, వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సాంకేతికత పెరిగినప్పటికీ, పత్రికలను నేరుగా ఇంటికి చేరవేసే పోస్టల్ వ్యవస్థపై ప్రజలకు ఇప్పటికీ ఎంతో నమ్మకం ఉందని తెలిపారు.
పోస్టల్ సేవలపై అవగాహన
హెడ్ పోస్ట్ మాస్టర్ బి. కిషన్ నాయక్ మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్ ద్వారా అందుతున్న వివిధ రకాల పొదుపు పథకాలు, బీమా మరియు ఇతర సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ సిబ్బందిని గుర్తించి సన్మానించినందుకు జాగృతి వారపత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో సహ కార్యవాహ నరసయ్య, బౌద్ధిక్ ప్రముఖ్ తిరునగరి దయాసాగర్, హెడ్ పోస్ట్ మాస్టర్ బి. కిషన్ నాయక్ మరియు పోస్టల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




