
మందమర్రిలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 19 ఏప్రిల్ 2026న తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ మోడల్ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రవేశ పరీక్షను 19 ఏప్రిల్ 2026 (ఆదివారం) నాడు నిర్వహించనున్నారు. 6వ తరగతి పరీక్ష ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతుండగా, 7వ తరగతి నుండి 10వ తరగతుల వరకు పరీక్షలు మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహించబడతాయి.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించిన విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రంలో హాల్ టికెట్ చూపించి ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయని, సమాధానాలను OMR షీట్లపై గుర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అభ్యర్థులు ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్, బాల్ పెన్నులు మరియు నీటి సీసా మినహా ఇతర సామాగ్రిని పరీక్షా హాలులోకి తీసుకురావడానికి అనుమతి లేదని మందమర్రి PM SHRI తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ ఒక ప్రకటనలో తెలిపారు.




