జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారి సన్నిధిలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

