మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 70 క్వింటాళ్ల PDS బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీల్లో పట్టుకున్నారు. రెండు బొలేరో పికప్ వాహనాల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, బియ్యం మరియు వాహనాల మొత్తం విలువ సుమారు రూ.5.40 లక్షలుగా అధికారులు తెలిపారు.
డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు భీమారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు తాళ్లపెల్లి గోపాల్, పస్తం సమ్మయ్యలను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. PDS బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

