సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కృష్ణ బృందావన్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. మొత్తం 307 ఓట్లు పోలవగా ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్‌కు 180 ఓట్లు లభించాయి. ప్రత్యర్థి ప్యానెల్‌పై 53 ఓట్ల మెజారిటీతో ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఉదయ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా శరత్, కోశాధికారిగా త్రినాథ్‌బాబు, జాయింట్ సెక్రటరీగా యోగేందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రేవంత్ ఎన్నికయ్యారు. కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.

