మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్లోని SPR గార్డెన్లో 312 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ, దండేపల్లి, లక్షెట్టిపేట్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.90 లక్షల విలువైన చెక్కులు అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు CMRF ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, సర్పంచులు, యువజన కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

