
నిర్మల్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీపై నమోదైన FIRను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుతో నియోజకవర్గ ఇన్చార్జ్ కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో నమోదైన FIRను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కేసు ప్రజాస్వామ్య హక్కులకు సంబంధించిన అంశంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జ పటేల్, కూచాడి శ్రీహరి రావు, ఏంబడి రాజేశ్వర్, విఠల్ రెడ్డి, అర్జుమంద్ అలీ పాల్గొన్నారు. ఇతర నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

