
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రిలో అరుదైన మైక్రోస్కోపిక్ న్యూరో సర్జరీ విజయవంతమైంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బాదంపల్లికి చెందిన 60 ఏళ్ల కౌసల్య ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో మెదడులో రక్తస్రావంతో పాటు అన్యురిజం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. అత్యాధునిక పరికరాలు, వైద్య బృందంతో చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కౌసల్య ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి, ఇతర వైద్యులు పాల్గొన్నారు.

