Janata Curfew | కేసీఆర్ సంచలన నిర్ణయం… జనతా కర్ఫ్యూ సమయం పెంపు…

తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటించాలని […]

కేసీఆర్ సూచనకే ప్రధాని మోదీ ఓకే.. హైదరాబాద్‌లోనూ కరోనా ధృవీకరణ ల్యాబ్

ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ ధృవీకరణకు పుణెలోని వైరాలజీ ల్యాబ్ ఒక్కటే అందుబాటులో ఉంది. ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిపిన టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలితే.. ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపుతుంటారు. ఐతే అన్ని రాష్ట్రాల నుంచి అక్కడికే నమూనాలు వెళ్తుండడంతో పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. […]

Coronavirus: కరోనాపై కేసీఆర్ కీలక ప్రకటన… రూ. 1000 కోట్లు…

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వైరస్‌పై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ తెలంగాణలో పుట్టింది కాదని… విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమే ఇది వచ్చిందని ఆయన వివరించారు. అతడు కూడా గాంధీ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని అన్నారు. కరోనా వస్తే చనిపోతారనే భయం కేవలం అపోహ […]

సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే రోజా

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా కంచి(తమిళనాడు), తిరుమల పర్యటనకు ఇవాళ ఉదయం బయల్దేరి వెళ్లారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గాన కంచికి పయనం అయ్యారు కేసీఆర్. రోడ్డు మార్గంలో వెళ్తున్న సీఎం కేసీఆర్ నగరికి చేరుకోగానే అపూర్వ స్వాగతం లభించింది. నగరి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు […]

హైదరాబాద్‌ బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్‌

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  గురువారం గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణ, ఏపీ మధ్య విభజన వివాదాల పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ పర్యటనకు వెళుతున్నారు. […]

ప్రకాశం బ్యారేజీని, నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ నివాసానికి వెళ్లిన కేసీఆర్… ఆయనతో పలు విషయాలపై చర్చలు జరిపారు. మరోవైపు జగన్ నివాసానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద తన వాహనం నుంచి […]

కేసీఆర్, జగన్ ల తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల్ని కూడా పరిష్కరించుకోవాలి: కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సీఎంలు కేసీఆర్, జగన్ తండ్రీకొడుకుల మాదిరిగా ఉండడం కాదు, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని సూచించారు. […]

జగన్‌, కేసీఆర్‌, చంద్రబాబుకు కేంద్రం లేఖ

పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల అధ్యక్షులతో ఈనెల 19న కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఇందులో భాగంగా వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్‌, తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్‌ జోషి లేఖరాశారు. అయిదు లక్ష్యాల […]

జగన్‌ వస్తే వైఎస్‌ఆర్‌ ఆత్మ క్షోభిస్తుంది: భట్టి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు.  తెలంగాణలో నిర్మించిన  కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ వస్తే ఆయన తండ్రి వైఎస్‌ఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆకృతి మార్పు, అవకతవకలకు పరోక్షంగా బాధ్యులు అవుతారని వివరించారు. అంతకు ముందు […]

ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్ మృతిపై కేసీఆర్, జగన్ సంతాపం

ప్రముఖ కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు గిరీశ్ కర్నాడ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. గిరీష్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. గిరీశ్ కర్నాడ్ చేసిన సేవలకు గాను […]